లాక్ డౌన్ లో తనయతో మహేశ్ బాబు కాలక్షేపం ఇలా..!

  • పిల్లలతో మహేశ్ ఆటపాటలు
  • తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
  • జ్ఞాపకాలు నిర్మించుకుంటున్నామంటూ క్యాప్షన్
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. అయితే ఆయనకు కాలక్షేపానికి లోటు లేదు. అందుకు కారణం సితార. మహేశ్ బాబుకు తన కుమార్తె సితార అంటే ఎంతో ఇష్టం అని ఆయన పోస్టుల ద్వారా అర్థమవుతుంది.

సినిమా కార్యక్రమాలన్నీ నిలిచిపోవడంతో మహేశ్ బాబు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టుల్లో ఎక్కువ శాతం తన పిల్లలకు సంబంధించినవే ఉంటున్నాయి. తాజా పోస్టులోనూ మహేశ్ బాబు తన కుమార్తె సితారతో ఆడుకుంటూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి "జ్ఞాపకాలను నిర్మించుకుంటున్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Mahesh Babu
Sitara
Lockdown
Tollywood

More Telugu News